Andhra Pradesh: జగన్ ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారు: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ

  • మోదీని, కేసీఆర్ ను చూసి భయపడింది బాబు కాదా?
  • మోదీకి ఎదురు నిలిచిన ధైర్యవంతుడు జగన్
  • ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ వద్దు ‘ప్రత్యేక ప్యాకేజ్’ ఇస్తే చాలని అన్నది సీఎం చంద్రబాబునాయుడని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈరోజు ఆమె మీడియతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ నోరుమూసుకుని కూర్చున్న చంద్రబాబు, ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఉన్న చంద్రబాబు కేసీఆర్ ను చూసి భయపడ్డారని, ఆ తర్వాత మోదీని చూసి భయపడ్డది ఆయనేనని విమర్శించారు.

జగన్ ని చూస్తే చంద్రబాబు వణికిపోతున్నారని, చంద్రబాబు ఎవరిని చూసి అయితే భయపడ్డారో, వాళ్లందరూ జగన్ వెనుక ఉన్నారని ఆయన చెబుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, మోదీ కలిసి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను ఎంతగా మాయ చేయాలనుకున్నారో తెలియని విషయాలు కాదని అన్నారు. మోదీకి భయపడి ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబు అని, మోదీకి ఎదురు నిలిచి ఆ హోదా కావాలన్న ధైర్యవంతుడు జగన్ అని ప్రశంసించారు.

Andhra Pradesh
YSRCP
jagan
Chandrababu
vasi reddy
padma
modi
kcr
special status
  • Loading...

More Telugu News