Andhra Pradesh: ఏపీ నుంచి జగన్ ని బహిష్కరించాలి: బుద్ధా వెంకన్న

  • జగన్ లాంటి వ్యక్తులు పోటీకి అనర్హులు
  • జగన్ ని ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారు
  • దేశ ద్రోహులకు ఎలాంటి శిక్ష వేస్తారో రాష్ట్ర ద్రోహులకూ అదే శిక్ష వేయాలి

జగన్ లాంటి వ్యక్తులు పోటీకి అనర్హులని, అయితే, చట్టంలో ఉన్న లొసుగులను చూపించి ఎన్నికల బరిలో నిలిస్తే నిలవొచ్చు కానీ, ప్రజల మనసుల్లో మాత్రం జగన్ కు స్థానం లేదని ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?’ అని జగన్ ఎప్పుడైతే అన్నాడో, అప్పటి నుంచే ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన జగన్ ని ఆ పార్టీ అభ్యర్థులు కూడా ‘ఛీ’ కొట్టాలని, ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండమని బయటకొచ్చేయాలని సూచించారు. ‘పగ వాడికి కూడా ఇలాంటి కొడుకు వద్దు’ అని జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో అన్నారట అని బుద్ధా ప్రస్తావించారు. దేశ ద్రోహులకు ఎలాంటి శిక్ష వేస్తారో రాష్ట్ర ద్రోహులకు కూడా అలాంటి శిక్షే వేయాలని జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ లాంటి వ్యక్తిని ప్రజలు రాష్ట్రం నుంచి బహిష్కరించాలని, అప్పుడు కానీ ఇలాంటి వ్యక్తుల్లో మార్పు రాదని అన్నారు.

Andhra Pradesh
Telangana
Buddha venkanna
jagan
  • Loading...

More Telugu News