Telangana: మన కష్టార్జితం రూ.లక్ష కోట్లు ఇవ్వని కేసీఆర్ కా జగన్ మద్దతు?: సీఎం చంద్రబాబు

  • ట్యాంకు బండ్ పై విగ్రహాలు కూలగొట్టినోళ్లకా మద్దతు?
  • ఆంధ్రోళ్లను రాక్షసులన్న వాళ్లకా జగన్ అభినందనలు?
  • ‘పోలవరం’పై పిటిషన్లు వేసే వాళ్లకా వైసీపీ మద్దతు?

ట్యాంకు బండ్ పై విగ్రహాలు కూలగొట్టిన వాళ్లకా జగన్ మద్దతు? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు పాల్గొన్నారు. ఆంధ్రోళ్లను రాక్షసులన్న వాళ్లకా జగన్ అభినందనలు? పోలవరం ప్రాజెక్టుపై పిటిషన్లు వేసే వాళ్లకా వైసీపీ మద్దతు? మన కష్టార్జితం రూ.లక్ష కోట్లు ఇవ్వని కేసీఆర్ కా జగన్ మద్దతు? అని జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ వర్గాల సమాచారం. ఆంధ్రా ద్రోహులంతా ఏకమయ్యారని, కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లు పట్టుకున్నారని, మోదీకి సామంతరాజు కేసీఆర్ అయితే, కేసీఆర్ కు సామంతరాజు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారని టీడీపీ వర్గాల సమాచారం.

Telangana
Andhra Pradesh
Chandrababu
kcr
YSRCP
jagan
Hyderabad
Tank bund
polavaram
  • Loading...

More Telugu News