New Delhi: ఢిల్లీలో 16 ఏళ్ల తెలుగమ్మాయిపై అఘాయిత్యం!

  • తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేకపోతున్న బాలిక
  • అబార్షన్ చేసినట్టు గుర్తింపు
  • నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

ఢిల్లీలో జరిగిన ఓ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుటేక్ నగర్‌లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించిన పోలీసులు సోమవారం సాయంత్రం ఏపీ భవన్ అధికారులకు సమాచారం అందించారు. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆమెపై గతంలో ఎవరో అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని, దాంతో గర్భం దాల్చడంతో ఇటీవలే అబార్షన్ చేయించినట్టుగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

ఆమె తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేకపోతోందని పేర్కొన్న పోలీసులు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తెలుగు తెలిసిన వ్యక్తిని పంపాల్సిందిగా ఏపీ భవన్ అధికారులను కోరారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.

New Delhi
Telugu girl
AP Bhavan
Rape
abortion
  • Loading...

More Telugu News