Chandrababu: నేడు కడపలో చంద్రబాబు రోడ్‌షో.. ప్రచారం చేయనున్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

  • కడపలో నేడు చంద్రబాబు బహిరంగ సభ
  • 27 ఏళ్ల తర్వాత కడపకు వస్తున్న ఫరూక్ అబ్దుల్లా
  • ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు కడపలో నిర్వహించనున్న రోడ్‌షోలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాల్గొనబోతున్నారు. కడప నుంచి టీడీపీ అభ్యర్థిగా అమీర్‌బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు అధికంగా ఉన్న కడపలోని గోకుల్ సెంటర్ నుంచి చంద్రబాబు రోడ్‌షో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొనబోతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.

అస్మాస్‌పేట బహిరంగ సభలో ఫరూక్ ప్రసంగించనున్నట్టు నేతలు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అబ్దుల్లా ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 1991 ఎన్నికల ప్రచారంలోనూ ఫరూక్ అబ్దుల్లా ఏపీలో ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌తో కలిసి ఆయన కడప, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత ఫరూక్ మళ్లీ కడపకు రానుండడం గమనార్హం.

Chandrababu
Telugudesam
Kadapa District
Jammu And Kashmir
Farooq abdullah
  • Loading...

More Telugu News