kotla suryaprakash reddy: కర్నూలులో బీజేపీకి భారీ షాక్.. నేడు టీడీపీలోకి ఆలూరు అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి

  • నేడు చంద్రబాబు సమక్షంలో చేరిక
  • సుజాత గెలుపు కోసం కృషి
  • షాక్‌లో బీజేపీ నేతలు

దాదాపు పుష్కర కాలంగా దూరంగా ఉంటున్న సోదరులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, హరిచక్రపాణిరెడ్డి తిరిగి ఒక్కటి కానున్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హరి టీడీపీలో చేరబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు వస్తున్న సీఎం సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.  

ఇప్పటికే బీజేపీ తరపున ఆలూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన హరిచక్రపాణి రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న సోదరుడు సూర్యప్రకాశ్ రెడ్డి భార్య   సుజాత గెలుపు కోసం పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, కోడుమూరు అభ్యర్థి రామాంజనేయులు గెలుపు కోసం కూడా ఆయన పనిచేయనున్నట్టు సమాచారం. హరి చేరికతో ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

kotla suryaprakash reddy
kotla harichakrapani reddy
Kurnool District
Telugudesam
BJP
kotla sujatha
  • Loading...

More Telugu News