TRS: అందుకు, కేసీఆర్ దొర కంకణం కట్టుకున్నారు: విజయశాంతి మండిపాటు

  • తెలంగాణలో మా పార్టీ  లేకుండా చేయాలని కుట్ర 
  • కేసీఆర్ మోదీ మనిషి
  • గెలుపోటములు నాకు మామూలే 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కేసీఆర్ దొర కంకణం కట్టుకున్నారని టీ-కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, ప్రముఖ సినీ నటి విజయశాంతి మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మోదీ మనిషి అని ఆరోపించారు. గెలుపోటములు తనకు మామూలేనని, ఇక్కడ తాను గెలిచినా ఓడినా ‘మెదక్’ తన సొంత ఇంటి లాంటిదని అన్నారు. ‘కాంగ్రెస్’ను ఆ పార్టీ నేతలు వీడుతుండటంపై విజయశాంతి స్పందిస్తూ, ఎవరు బయటకు వెళ్లినా ఏమీ కాదని అన్నారు.  

TRS
KCR
T-congress
Vijayashanti
Medak
  • Loading...

More Telugu News