AP: ఏపీలో టీడీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోంది: సీఈసీకి జీవీఎల్ ఫిర్యాదు

  • ప్రత్యేక పరిశీలకులను నియమించాలి
  • ధనబలంతో ఎన్నికల్లో దిగే పార్టీలపై చర్యలు తీసుకోవాలి
  • టీడీపీ ధనరాజకీయాలపై ఫిర్యాదు చేశాం

ఏపీలో టీడీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోందని కేంద్ర ఎన్నిక సంఘం (సీఈసీ)కి ఫిర్యాదు చేశామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో సీఈసీని జీవీఎల్ కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ధనరాజకీయాలపై ఫిర్యాదు చేశామని, ప్రత్యేక పరిశీలకులను నియమించాలని కోరామని చెప్పారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా చేసే వారిపై నిఘా పెట్టాలని, ధనబలంతో ఎన్నికల్లో దిగే పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. ఈ ఎన్నికలను టీడీపీ ధనమయం చేసిందని, రూ.6 వేల కోట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ పన్నాగమని ఆరోపించారు.

AP
Telugudesam
CEC
Bjp
Gvl
Narasimha rao
  • Loading...

More Telugu News