Andhra Pradesh: భూతద్దం అక్కర్లేదు, మూసుకున్న కళ్లు తెరిచి చూడండి చాలు: షర్మిళకు యామిని హితవు

  • సీఎం చేసిన అభివృద్ధిపై ప్రశ్నించే అర్హత మీకు లేదు
  • దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీని నిలబెట్టాం
  • జైల్లో ఉండొచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలట!

భూతద్దం పెట్టి వెతికినా ఏపీలో అభివృద్ధి కనపడదని వైసీపీ నేత షర్మిళ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, భూతద్దం అక్కర్లేదు, మూసుకుపోయిన కళ్లు తెరచి చూస్తే చాలు ఏపీలో అభివృద్ధి కనబడుతుందని హితవు పలికారు.

సీఎం చేసిన అభివృద్ధి గురించి ప్రశ్నించడానికి మీకు ఎటువంటి అర్హత ఉందని కోటి మంది అక్కాచెల్లెళ్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు. ‘చంద్రబాబును విమర్శిస్తున్న మీ జగనన్నకు, జలగన్నకు ఉన్న అర్హతలేంటి?’ అని ప్రశ్నించారు. జైల్లో ఉండొచ్చిన, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ తనను ముఖ్యమంత్రి చేయమని అడగడం హాస్యాస్పదమని అన్నారు. 

Andhra Pradesh
Telugudesam
sadhinenei
yamini
YSRCP
  • Loading...

More Telugu News