YSRCP: జగన్ నేరాలూ ఘోరాలను ‘పసుపు-కుంకుమ’ కింద పంచుకుంటున్న చెల్లెమ్మ షర్మిళ: సాధినేని యామిని

  • ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కనపడట్లేదు
  • మన జలగన్న వదిలిన బాణం షర్మిళా రెడ్డి
  • అవాకులు చెవాకులు పేలొద్దు

వైసీపీ నేత షర్మిళ వ్యాఖ్యలకు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి, అవినీతి, అక్రమాస్తుల జలగన్నకు చెల్లెమ్మగా ఉంటూ, జగన్, తండ్రి వైఎస్ చేసిన నేరాలూ ఘోరాలన్నింటిలోనూ ‘పసుపు-కుంకుమ’ కింద పంచుకుంటున్న చెల్లెలు షర్మిళా రెడ్డి అని ఆరోపించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి, ‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు ఇచ్చిన డబ్బులు ఆమెకు కనిపించడం లేదని అన్నారు. మన జలగన్న వదిలిన బాణం షర్మిళా రెడ్డి అని అందరూ అనుకుంటూ ఉంటారని సెటైర్లు విసిరారు.

లోటస్ పాండ్ లో ఉండే జగన్ ఎప్పుడో ఓసారి ఏపీకి వస్తారని, బెంగళూరులో ఉండే షర్మిళ కూడా అంతేనని విమర్శించారు. జగన్ ని జైలులో పెట్టినప్పుడు ఓసారి మాట్లాడిన షర్మిళ, మళ్లీ ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతోందని మండిపడ్డారు.

YSRCP
jagan
Sharmila
Telugudesam
sadhineni
  • Error fetching data: Network response was not ok

More Telugu News