West Godavari District: కేఏ పాల్ కు షాక్.. భీమవరంలో నామినేషన్ తిరస్కరణ

  • నామినేషన్ సమర్పించేందుకు ఆలస్యంగా వెళ్లిన పాల్
  • సమయం మించిపోయిందంటూ నామినేషన్ తిరస్కరణ
  • నామినేషన్ తిరస్కరణపై పాల్ మండిపాటు

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించేందుకు కేఏ పాల్ ఈరోజు వెళ్లారు. అయితే, ఆలస్యంగా వెళ్లడంతో ఆయన నామినేషన్ ని అధికారులు తీసుకునేందుకు నిరాకరించారు.

కాగా, ఈ ఘటనపై కేఏ పాల్ మండిపడుతున్నారు. తన నామినేషన్ ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. కాగా, నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పాల్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమవరం నుంచి కూడా తాను పోటీ చేస్తానని పాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

West Godavari District
Bhimavaram
Praja shanti
pal
  • Loading...

More Telugu News