Andhra Pradesh: వైఎస్ జగన్ నా అన్న.. నా రక్తం!: విమర్శకులకు మంచు వెరోనికా కౌంటర్

  • జగన్ కు సపోర్ట్ ఇవ్వడంపై కొందరు నెటిజన్ల విమర్శలు
  • దీటుగా స్పందించిన వెరోనికా మంచు
  • తనకు ఫ్యామిలీనే ముఖ్యమని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వడంపై కొందరు నెటిజన్ల విమర్శలకు హీరో మంచు విష్ణు భార్య వెరోనికా ఘాటుగా స్పందించారు. అసలు జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని విమర్శకులను ఎదురు ప్రశ్నించారు. జగన్ తన అన్న అనీ, తన రక్తమని వెరోనికా వ్యాఖ్యానించారు. తనకు అన్నింటికంటే తన కుటుంబమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో వెరోనికా రెడ్డి స్పందిస్తూ..‘నేను వైఎస్ జగన్ ను ఎందుకు సమర్థిస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మీకు తెలియదేమో! జగన్ నా అన్న.. నా రక్తం. నామటుకు అన్నింటికంటే నా కుటుంబమే ముఖ్యం.  #APneedsYSJagan #VoteForFan #APElections2019’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Twitter
manchu
veronika
counter
vote for fan
  • Loading...

More Telugu News