peddapalli: తక్కువ సమయం ఉన్నందున పోటీ చేయడం లేదు: పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌

  • కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించడంతో మనస్తాపం
  • తనను నమ్మించి మోసం చేశారని ఆరోపణ
  • బీజేపీలో చేరుతారని ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నేత

ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ ఎన్నికలకు అతి కొద్ది సమయమే ఉన్నందున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ స్పష్టం చేశారు. వివేక్‌కు కేసీఆర్‌ ఎంపీ టికెట్టు ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్‌పై ఆయన భగ్గుమన్నారు. నమ్మించి గొంతు కోశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో వివేక్ అధికార బీజేపీలో చేరుతారని, లేదా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. వీటన్నింటికీ తెరదించుతూ ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఎన్నికల బరిలో ఉండడం లేదని అందులో పేర్కొన్నారు. తక్కువ సమయం ఉన్నందున ఎన్నికల గుర్తు వేగంగా ప్రజల్లోకి వెళ్లదని, అందువల్ల  పోటీ చేయక పోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. అసలు తాను పోటీలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ పెద్దపల్లి టికెట్‌ను ఆలస్యంగా ప్రకటించారని ఆ ప్రకటనలో ఆరోపించారు.

peddapalli
vivek
KCR
  • Loading...

More Telugu News