mahesh babu: తన విగ్రహం పక్కన కుటుంబంతో కలసి మహేశ్ బాబు.. వీడియో చూడండి

  • మహేశ్ మైనపు విగ్రహాన్ని తయారు చేసిన మేడమ్ టుస్సాడ్స్
  • ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఆవిష్కరించిన మహేశ్ 
  • అభిమానుల సందర్శనానంతరం సింగపూర్ కు తరలింపు

టాలీవుడ్ లో మహేశ్ బాబుకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దానిని గుర్తించిన ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. అచ్చం మహేశ్ ను పోలిన మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ లో విగ్రహాన్ని మహేశ్ బాబు, మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి మహేశ్ కుటుంబంతో పాటు, భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేశ్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అనంతరం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.

mahesh babu
madame tussauds
wax statue
tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News