Andhra Pradesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ పై వైఎస్ షర్మిల సెటైర్లు!

  • బాబు పాలనలో సామాన్యుడు సంతోషంగా లేడు
  • కాంట్రాక్టుల కోసమే పోలవరాన్ని లాక్కున్నారు
  • నిప్పు నిప్పు అన్నంతమాత్రన తుప్పు నిప్పైపోదు

ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో సామాన్యుడు సంతోషంగా లేడని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. ‘చందమామను తెచ్చిస్తా’ అని చంద్రబాబు చెప్పే అబద్ధాలను ఏపీ ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు పదవి కోసమే పథకాలు ప్రకటిస్తారనీ, తర్వాత ప్రజలను పట్టించుకోరని దుయ్యబట్టారు. కాంట్రాక్టుల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకున్నారని వ్యాఖ్యానించారు.

రాజధాని ప్రాంతంలో ఎకరం రూ.3 కోట్లు పలుకుతున్న భూములను రూ.50 లక్షలకే తన బినామీలకు సీఎం కట్టబెట్టారని విమర్శించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

నిప్పునిప్పు అని చెప్పుకున్నంత మాత్రాన తుప్పు నిప్పు అయిపోతుందా? అని షర్మిల ప్రశ్నించారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని దుయ్యబట్టారు. కేటీఆర్ కు పోటీగానే ఏపీ ఐటీ శాఖను నారా లోకేశ్ కు చంద్రబాబుకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు.

అసలు జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేశ్ కు చంద్రబాబు మూడు మంత్రి పదవులు అప్పగించారని షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రశ్నించరన్న నమ్మకంతోనే బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని షర్మిల ఆరోపించారు. బాబు-మోదీ జోడీ వల్లే ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
sharmila
Nara Lokesh
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News