Telangana: చిటికెనవేలికి ఆపరేషన్ చేస్తే ప్రాణాలు పోయాయి.. ఆసుపత్రి ముందు మృతుడి బంధువుల ఆందోళన!

  • హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రిలో ఘటన
  • గుట్టుగా మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలింపు 
  • ఆందోళనకు దిగిన బాధితుడి కుటుంబ సభ్యులు

కాలి చిటికెన వేలుకు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసిన మరుసటి రోజే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని గుట్టుగా గాంధీ ఆసుపత్రికి తరలించాయి. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న విరించి ఆసుపత్రిలో సింగరేణి ఉద్యోగి సంగీత్ రావు చేరారు. ఆయన కాలికి శనివారం వైద్యులు ఆరేషన్ చేశారు. అయితే నిన్న ఆరోగ్యం విషమించడంతో సంగీత్ రావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విరించి ఆసుపత్రి డాక్టర్లు మృతదేహాన్ని గుట్టుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

Telangana
Hyderabad
virinchi
hospital
patient dead
  • Loading...

More Telugu News