Telangana: వచ్చే నెలలో టీఆర్ఎస్‌లో చేరనున్న సండ్ర

  • ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో టీఆర్ఎస్‌లో చేరిక
  • అనుచరులకు చెప్పిన సండ్ర
  • తనతో కలిసి రావాలని కోరిన నేత

తెలంగాణలో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ టీర్థం పుచ్చుకోబోతున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు సండ్ర ఇప్పటికే తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తాను టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని, అందరూ తనతో కలిసి రావాలని కోరారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, సండ్ర టీఆర్ఎస్ లో చేరుతున్నారు.   

Telangana
Telugudesam
Sandra venkata veeraiah
TRS
Khammam District
Sattupally
  • Loading...

More Telugu News