YSRCP: ఇంత పట్టుదల రెడ్లలో నేనెప్పుడూ చూడలేదు!: జేసీ దివాకర్ రెడ్డి

  • జగన్ కు ‘విజన్’, పట్టుదల లేవు
  • 90 శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారు
  • నాకు జగన్ పై కోపం లేదు, సానుభూతి, బాధ ఉన్నాయి

జగన్ పై తనకు కోపం లేదని, సానుభూతి, బాధ ఉన్నాయని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆయనకు ‘విజన్’ లేదు, పట్టుదల లేవని అభిప్రాయపడ్డారు.

‘రాష్ట్ర రాజకీయాలు రెండు కులాల మధ్య పోరాటంగా అనిపిస్తున్నాయి?’ అనే ప్రశ్నకు జేసీ సమాధానమిస్తూ, తొంభై శాతం రెడ్డి కులస్తులు వైసీపీకి మద్దతుగా ఉన్నారని, బహు:శా ఇంత పట్టుదల రెడ్లలో తానెప్పుడూ చూడలేదని అన్నారు. 92 నుంచి 95 శాతం వరకు కమ్మ కులస్తులు టీడీపీకి మద్దతిస్తున్నారని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ‘ఓన్లీ ఫర్ బలిజ’ అన్నట్టుగా ఉంది అని పేర్కొన్నారు.

YSRCP
Jagan
Telugudesam
Jc
Diwakar Reddy
  • Loading...

More Telugu News