Andhra Pradesh: నా ‘ఆత్మకథ’ రాయాల్సి వస్తే వాళ్లిద్దరి ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది: జేసీ దివాకర్ రెడ్డి

  • నాకు తెలిసిన కఠిన సత్యాలు కూడా ఇందులో ఉంటాయి
  • వైఎస్, చంద్రబాబు గురించి అన్నీ నిజాలే చెబుతా
  • రాజశేఖరరెడ్డికి సైకాలజీ బాగా తెలుసు 

‘నా ‘ఆత్మకథ’ రాయాల్సి వస్తే అందులో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల ప్రస్తావన తప్పకుండా ఉంటుంది’ అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు తెలిసిన కఠిన సత్యాలు కూడా ఈ ‘ఆత్మకథ’లో ఉంటాయని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని, వైఎస్, చంద్రబాబు గురించి అన్నీ నిజాలే చెబుతాను తప్ప, అబద్ధాలు చెప్పనని ఘంటాపథంగా చెప్పారు.

‘ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు కదా, మరి, రాజశేఖరరెడ్డి, మీరు ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్నకు జేసీ సమాధానమిస్తూ, ‘నా కోసం రాజశేఖర్ రెడ్డి ఉన్నాడనిపించేలా ఆయన మాటలు, బిహేవియర్ ఉండేది.  నేను ఎంత కోపంగా పోయినా..‘వాడు ఎట్టా ఉన్నాడు, వీడు ఎట్టా ఉన్నాడు...’ అని అనేవాడు. అయిపోయే, కోపం ‘తుస్సు’ మంటుంది. అతనికి (రాజశేఖరరెడ్డి) సైకాలజీ బాగా తెలుసు. వెరీ ఫ్రెండ్లీ. ‘తన’ అనుకున్న వాళ్లకు సాయం చేసే గుణం అతనిలో ఉండేది’ అని చెప్పుకొచ్చారు.

Andhra Pradesh
Telugudesam
JC Diwakar reddy
Ys
Babu
  • Loading...

More Telugu News