KA Paul: తెల్లవారుజామున సోషల్ మీడియాలో కేఏ పాల్ లైవ్.. ఎన్నికల నిబంధన ఉల్లంఘన!
- ప్రజాశాంతి పోరాటం ఎలా ఉంది?
- ప్రజల స్పందన ఎలా ఉంది? అంటూ లైవ్
- వివాదాస్పదమైన లైవ్
ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారు వినూత్న పంథాలను ఎంచుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ చేపట్టిన ప్రచారం వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌లో తెల్లవారుజామున 3 గంటలకు సోషల్ మీడియాలో లైవ్ చేపట్టి ఎన్నికల నిబంధనను ఉల్లఘించారు.
ఎన్నికల బరిలో ప్రజాశాంతి పోరాటం ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది? వంటి ప్రశ్నలను సంధిస్తూ, తన లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలపై లైవ్ ద్వారా వివరించారు. అయితే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులు ప్రచారం నిర్వహించకూడదు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేపట్టిన పాల్, అభిమానులకు కనెక్ట్ అయ్యేందుకే తాను అలా చేయాల్సి వచ్చిందంటూ సమర్థించుకుంటున్నారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.