Janasean: జనసేన అధినేత ‘ప్యాకేజ్ కల్యాణ్’లా మారారు: పవన్ పై జీవీఎల్ ఫైర్

  • తెలంగాణలో ఏపీ వాళ్లను తరిమికొడుతున్నారా?
  • ఆ ఘటనలు ఎక్కడ జరిగాయో బయటపెట్టాలి
  • ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రజలను రెచ్చగొట్టొద్దు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపణలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్.. ప్యాకేజ్ కల్యాణ్’లా మారారని ఆరోపించారు. తెలంగాణలో ఏపీ వాళ్లను తరిమికొడుతున్నారని పవన్ అన్నారని, ఆ ఘటనలు ఎక్కడ జరిగాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా ప్రజలను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. తెలంగాణ ఏమన్నా పాకిస్థానా? అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ తన కుటుంబం అక్కడ ఎందుకు నివసిస్తుందో సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు మాటలను పవన్ వింటే తన రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేసుకున్నట్టేనని అన్నారు.

Janasean
Pawan Kalyan
Bjp
Gvl
  • Loading...

More Telugu News