Andhra Pradesh: జనసేనకు ఝులక్.. వైసీపీలో చేరిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని!

  • నేడు రేపల్లె సభలో వైసీపీ తీర్థం
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • జగన్ ఏం హామీ ఇచ్చారన్న విషయమై రాని స్పష్టత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి ఈరోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఈరోజు జగన్ రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పిన జగన్.. మల్లికార్జున రావును వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కృష్ణా జిల్లాలోని పామర్రు సీటును మల్లికార్జునరావు ఆశించారు. అయితే పవన్ ఇందుకు సుముఖంగా లేకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా, ఈ విషయమై జనసేన వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు పార్టీలో జగన్ ఏ బాధ్యత అప్పగిస్తామన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

Andhra Pradesh
Jana Sena
YSRCP
Guntur District
repally
devneni
mallikarjuna rao
  • Loading...

More Telugu News