Australia: ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసహజ చర్యలు!

  • ఇద్దరి 'సంబంధం'పై అనుమానాలు
  • కెమెరాకు దొరికిన చేష్టలు
  • వైరల్ గా మారిన వీడియో

పాశ్చాత్యదేశాల్లో గే సంస్కృతి పట్ల పెద్దగా ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయరు. అయితే అది క్రీడారంగంలో కూడా ప్రబలిందా? అనిపించే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. షార్జాలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుండగా మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా మధ్య జరిగిన సల్లాపాలు చూస్తే ఆ ఇద్దరూ స్వలింగ సంపర్కులు అనిపించకమానదు.

 ఓవైపు ఆసీస్ బ్యాట్స్ మెన్ చేజింగ్ లో తలమునకలై ఉండగా, డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో వీళ్లిద్దరూ ఒకరిని ఒకరు తడముకుంటూ, నిమురుకుంటూ, పరస్పరం ముద్దాడేందుకు ప్రయత్నించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ తతంగం అంతా కెమెరాకు దొరికిపోవడంతో దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Australia
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News