India: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి.. హేమమాలినికి చెక్ పెట్టేందుకు ప్లాన్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a0feb7b22b6452c9ddbe583e486e049b44f1f0a9.jpg)
- యూపీలో రాజ్ బబ్బర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
- బిగ్ బాస్-11తో ఉత్తరాది రాష్ట్రాల్లో గుర్తింపు
- మథుర నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ వ్యూహం
ఉత్తరాది రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ సప్నా చౌదరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని యూపీ తూర్పు విభాగం బాధ్యతలు చూస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ధ్రువీకరించారు. 2017లో హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో-11లో సప్నా చౌదరి పాల్గొన్నారు. అంతకుముందు ఏడాది ఓ కార్యక్రమంలో దళితుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని ఆమెపై హరియాణాలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-3d236b0c98b9e74bf08e04ecddf361de9b166fa1.jpg)