Chittoor District: మంచు కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి: సాధినేని యామిని

  • విమర్శించే నైతిక హక్కు మోహన్ బాబుకు లేదు
  • మీ స్థాయి ఏంటో తెలుసుకోండి
  • జగన్ కు స్పష్టమైన ప్రణాళికలు, విజన్ లేదు

ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు సినీ నటుడు మోహన్ బాబుకు లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్యా సంస్థలు నడుపుతున్న కొందరు చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదంటూ ‘మంచు’ కుటుంబంపై విమర్శలు చేసింది. మంచు కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, చంద్రబాబును విమర్శించే ముందు వారి స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. సంక్షోభంలో ఉన్న ఏపీకి చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వం అవసరమన్న యామిని, రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ కు స్పష్టమైన ప్రణాళికలు, విజన్ లేవని విమర్శించారు.

Chittoor District
Tirupathi
Telugudesam
sadineni
yamini
  • Loading...

More Telugu News