Andhra Pradesh: నేను గెలుస్తానన్న భయంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.. 3 నెలలైనా రాజీనామాను ఆమోదించలేదు!: గోరంట్ల మాధవ్

  • చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు
  • ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీలు సీఎం ఆదేశాలతో పనిచేస్తున్నారు
  • ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం

హిందూపురం లోక్ సభ స్థానం నుంచి తాను గెలుస్తానన్న భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. అందులో భాగంగానే తాను 3 నెలల క్రితం పోలీస్ ఉద్యోగానికి వీఆర్ సమర్పించినా ఆమోదించలేదని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఈరోజు మీడియాతో గోరంట్ల మాధవ్ మాట్లాడారు.

ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీలు చంద్రబాబునాయుడు ఆదేశాలతో పనిచేస్తున్నారని విమర్శించారు. రేపు తన భార్య, తాను నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పారు. ఒకవేళ తన నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఆమోదించకపోతే తన భార్య పోటీచేస్తుందని గోరంట్ల మాధవ్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Andhra Pradesh
Anantapur District
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
hindupur
gorantla madhav
  • Loading...

More Telugu News