West Godavari District: పవన్‌కల్యాణ్‌! టీడీపీలో చేరు... నిన్ను నేను గెలిపించుకుంటా: ఎమ్మెల్యే చింతమనేని

  • రాజకీయాల నుంచి తప్పుకుని నా సీటు నీకిస్తా
  • నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత తీసుకుంటా
  • జనసేనాని విమర్శలపై ప్రభాకర్‌

తన గురించి వాస్తవాలు తెలుసుకోకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని, ఆయన జనసేనను టీడీపీలో విలీనం చేస్తే తాను ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అదే సమయంలో తన స్థానం నుంచి ఆయన పోటీచేస్తే ఆయనను గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత కూడా తాను తీసుకుంటానని తెలిపారు.

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే చింతమనేని ప్రభాకర్‌పై తొలి నుంచి పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో దెందులూరులో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడుతూ ‘చింతమనేని అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు.

తాజాగా చింతమనేని ప్రభాకర్‌ వంటి వారు ఉండడం వల్లే తాను తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం లేదని పవన్‌కల్యాణ్‌ చేసిన విమర్శలకు దెందులూరు ఎమ్మెల్యే ఘాటైన జవాబిచ్చారు. పార్టీలో చేరడానికి తానే అడ్డు అయితే తప్పుకుంటానని చెప్పారు. ఒకవేళ పవన్‌ గెలిచి అసెంబ్లీకి వస్తే నేనేంటో ఆయనకు తెలియజేస్తానని స్పష్టం చేశారు.

West Godavari District
denduluru
Chinthamaneni Prabhakar
Pawan Kalyan
  • Loading...

More Telugu News