GVL: ఏప్రిల్ 11న ఆరిపోనున్న తెలుగుదేశం జ్యోతి: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ
  • అవినీతి తప్ప బాబు పాలనలో మరేమీ లేదు
  • విజయవాడలో జీవీఎల్ నిప్పులు

వచ్చే నెల 11వ తేదీన తెలుగుదేశం పార్టీ జ్యోతి ఆరిపోనుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి పార్టీ నేతలపై బురదజల్లుతున్న టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగిన జీవీఎల్, భూ కబ్జాలు, అవినీతి తప్ప చంద్రబాబు పాలనలో మరేమీ కనిపించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ తమపై అసత్య ప్రచారాన్ని చేస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ప్రజలకు సంక్షేమ పథకాలను, ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూ, ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

GVL
Telugudesam
Chandrababu
Vijayawada
  • Loading...

More Telugu News