Chinni Krishna: పవన్! మేమూ కాపులమే... జాగ్రత్తగా మాట్లాడండి: సినీ రచయిత చిన్నికృష్ణ

  • హైదరాబాద్ లో ఏమైనా అయితే నాగబాబు కాపాడతారా?
  • ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపిన ఘనత చిరంజీవిది
  • కాబోయే సీఎం జగనేనన్న చిన్నికృష్ణ

కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని, తాము కూడా కాపులమేనని, ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కల్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని సినీ రచయిత చిన్నికృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా కాపు బిడ్డనేనని, హైదరాబాద్ లో తమపై ఎవరైనా దాడి చేస్తే, పవన్ వచ్చి రక్షిస్తారా? ఆయన అన్న నాగబాబు వచ్చి రక్షిస్తారా? అని ప్రశ్నించారు.

ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నో రికార్డులను తిరగరాసిన 'ఇంద్ర' వంటి సినిమాను చిరంజీవికి ఇస్తే, కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించిన ఘనత చిరంజీవిదని విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పేరిట పార్టీని పెట్టి, ఆపై దాన్ని కాంగ్రెస్ లో కలిపారని, తనకు ఓట్లు వేసిన ప్రజలను ఆయన ఒక్కసారైనా కలిశారా? అని ప్రశ్నించారు.

రానున్న ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, కాబోయే సీఎం జగనేనని అంచనా వేసిన చిన్నికృష్ణ, జగన్ ఒక్కడిని చేసి, తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేనలు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు.

Chinni Krishna
Pawan Kalyan
Jagan
Nagababu
  • Loading...

More Telugu News