West Godavari District: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అడుగులు అటు వైపేనా?

  • మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం
  • నేడో, రేపో టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం
  • ఇప్పటికే కాపు కార్పొరేషన్‌ పదవికి రాజీనామా

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి టీడీపీలోకి వెళ్లారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. జరగనున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలో మనస్తాపానికి గురైన కొత్తపల్లి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో ఈ మేరకు చర్చించారని సమాచారం. టీడీపీకి రాజీనామా చేసి ఆయన రేపు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.

West Godavari District
narsapuram
kothapalli subbarayudu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News