Narendra Modi: ప్రధాని మోదీవన్నీ హిట్లర్‌ సిద్ధాంతాలు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

  • విమర్శకులపై దాడులే ఆయన ఎజెండా
  • ఎన్నికల వేళ మరింత అధికం
  • మైనార్టీ కుటుంబంపై దాడి నేపథ్యంలో ఆరోపణలు

ప్రధాని మోదీవి జర్మనీ నియంత హిట్లర్‌ తరహా విధానాలని, విమర్శకులపై దాడులే ఆయన ఎజెండా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ మైనార్టీ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారన్న వార్త నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేయడమేకాక దాడులకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘ఇలా దాడులు చేయాలని ఏ రామాయణంలో రాసుంది? ఏ గీత చెబుతోంది?’ అని ఆయన ప్రశ్నించారు. హిట్లర్‌ పాలనలో దుండగులు అమాయక ప్రజల్ని హింసించి చంపేవారని, ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి బెదిరించే వారని ఆయన గుర్తు చేశారు. అవే సిద్ధాంతాలను మోదీ అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ ఇటువంటి చర్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్న విషయం మోదీ అనుచరులకు అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు.

Narendra Modi
Arvind Kejriwal
hitlar
Haryana
  • Loading...

More Telugu News