DY Dasu: టికెట్ ఇస్తానని మోసం చేసిన పవన్ కల్యాణ్: రాజీనామా చేస్తున్నానన్న పామర్రు మాజీ ఎమ్మెల్యే

  • నాదెండ్ల మనోహర్ పిలిస్తే వెళ్లాను
  • 18న జనసేనలో చేరితే టికెట్ ఇస్తానని హామీ
  • జాబితాలో పేరు చేర్చకుండా మోసం

తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, పార్టీలో చేర్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆపై తనను దారుణంగా మోసం చేశారని, తాను ఇప్పుడు మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని పామర్రు మాజీ ఎమ్మెల్యే, ఇటీవల జనసేనలో చేరిన డీవై దాసు వెల్లడించారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తనను స్వయంగా ఆహ్వానిస్తే, 18వ తేదీన వెళ్లి, పవన్ ను కలిసి, ఆ పార్టీలో చేరానని, టికెట్ ఇస్తానని చెప్పడంతో, కార్యకర్తలతో కలిసి ప్రచారం కూడా ప్రారంభించానని ఆయన అన్నారు.

తీరా జాబితాలో తన పేరు లేకపోవడంతో మనోహర్ కు ఫోన్ చేశానని, ఆయన సరిగ్గా స్పందించలేదని, పవన్ కార్యాలయం నుంచి పులిశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి, మాట్లాడాల్సివుందని, తనను ఆహ్వానిస్తే వెళ్లానని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. తనను మోసం చేసిన జనసేనకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

DY Dasu
Pamarru
Jana Reddy
Nadendla
Pawan Kalyan
  • Loading...

More Telugu News