BJP: అద్వానీ రాజకీయ భీష్ముడు.. ఆయనది బలవంతపు రిటైర్మెంట్: శివసేన

  • గాంధీనగర్ నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచిన అద్వానీ
  • ఆ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అమిత్ షా
  • ‘సామ్నా’లో బీజేపీపై నిప్పులు చెరిగిన శివసేన

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీపై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. బీజేపీలో ఆయనో గొప్ప నేత అని ప్రశంసించింది. రాజకీయాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన అద్వానీ బీజేపీలో ఎప్పటికీ పెద్ద నేత ఆయనేనని కీర్తించింది. రెండు రోజుల క్రితం బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు కనిపించలేదు. ఆయన పోటీ చేసే గాంధీనగర్ స్థానం నుంచి ఈసారి అమిత్ షా బరిలోకి దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో బీజేపీని తూర్పారబట్టింది. అద్వానీ రాజకీయ ‘భీష్ముడు’ అని పేర్కొంది. ఆయనను బలవంతంగా రాజకీయాల నుంచి తప్పించారని ఆరోపించింది. ఆయనది బలవంతపు రిటైర్మెంట్ అని పేర్కొంది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ.. వాజ్‌పేయితో కలిసి పార్టీని నడిపించారని పేర్కొంది. అద్వానీ స్థానాన్ని నేడు మోదీ, అమిత్ షాలు లాగేసుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు అద్వానీ గెలుపొందారని, ఆ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేయడమంటే దానర్థం అద్వానీతో బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించడమేనని ‘సామ్నా’ పేర్కొంది.

  • Loading...

More Telugu News