YSRCP: తనకు కండువా కప్పబోయిన జగన్‌కు షాకిచ్చిన పి.గన్నవరం ఎమ్మెల్యే

  • వైసీపీ కండువాను కప్పుకోని పులపర్తి
  • దండం పెట్టి వెనక్కి వచ్చేసిన ఎమ్మెల్యే
  • సొంతపార్టీ నేతలపై జగన్ ఆగ్రహం

తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడిన తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనకు కాదని నెలపూడి స్టాలిన్ బాబుకు టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెంది, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. శనివారం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. పిఠాపురంలో జరిగే వైసీపీ సభలో భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో ఆయన పార్టీలో చేరతారని పేర్కొన్నారు.  

అనుకున్నట్టే పులపర్తి నారాయణమూర్తి పిఠాపురం సభలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని జగన్ భావించారు. అయితే, పులపర్తి అందుకు తిరస్కరించారు. సభకు వచ్చిన జనాలకు చేతులెత్తి నమస్కరించి వెనుదిరిగారు. దీంతో ఏం జరిగిందో అర్థంకాక సభకొచ్చినవారు, నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. నారాయణ తీరుతో అవాక్కైన జగన్ ఆయనను తన వద్దకు తీసుకొచ్చిన సొంతపార్టీ నేతలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRCP
YS jagan
pithapuram
East Godavari District
Pulaparthi Narayana murthy
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News