YSRCP: జగన్ ఆస్తులు 1100 శాతం ఎలా పెరిగాయి? అఫిడవిట్ పై ఎన్నికల సంఘం విచారణ జరపాలి: వర్ల రామయ్య

  • రూ.1.73 కోట్ల నుంచి రూ.331 కోట్లకు ఎలా పెరిగాయి?
  • అఫిడవిట్ లో జగన్ తన ఆస్తులన్నింటిని చేర్చలేదు
  • జగన్ దొంగలకే గజదొంగ

2004-19 మధ్య జగన్ ఆస్తులు 1100 శాతం ఎలా పెరిగాయో చెప్పాలని ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఆస్తులు రూ.1.73 కోట్ల నుంచి రూ.331 కోట్లకు ఎలా పెరిగాయి? రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో జగన్ తన బీఎండబ్ల్యూ, స్కార్పియో వాహనాలను, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరూలోని యలహంక ప్యాలెస్ ను ఎందుకు చేర్చలేదు? అని ప్రశ్నించిన ఆయన, జగన్ దొంగలకే గజదొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తన ఆస్తులకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్ పై ఎన్నికల సంఘం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

YSRCP
Jagan
Telugudesam
Varla Ramaiah
amaravathi
  • Loading...

More Telugu News