Andhra Pradesh: ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నారు?: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • గత రెండేళ్లుగా జగన్ అసెంబ్లీ ముఖం చూడలేదు
  • సీఎం తర్వాత అంతటి హోదా ప్రతిపక్ష నాయకుడిది
  • ప్రతి దానినీ రాజకీయం చేయడమే జగన్ లక్ష్యం

ఏపీ ప్రయోజనాలను తెలంగాణలో తాకట్టుపెట్టడమే కాకుండా, ఇక్కడున్న వ్యవస్థలపై తనకు నమ్మకం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి దానినీ రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధి పొందడమే జగన్ లక్ష్యంగా ఉందని అన్నారు.

 ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ఉందని ఓ ప్రతిపక్ష నాయకుడిలా జగన్ తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి హోదా ప్రతిపక్ష నాయకుడిదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సీఎం తర్వాత ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికే ఉంటుందన్న విషయాన్ని ఆయన మరిచిపోయారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తాను రాకపోవడమే కాకుండా, వైసీపీ సభ్యులను కూడా రానీయకుండా చేసిన జగన్ పై విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లుగా అసెంబ్లీ ముఖం చూడని జగన్ ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో తమకు ఓటేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు.

Andhra Pradesh
YSRCP
jagan
Telugudesam
buddha
  • Loading...

More Telugu News