Chittoor District: శ్రీ విద్యానికేతన్ లో విద్యా శాఖ ఎంక్వయిరీకి సిద్ధమేనా?: కుటుంబరావు
- ‘ప్లేస్ మెంట్ అండ్ ట్రైనింగ్’ కు డబ్బు ఇవ్వాలి
- ఆఫర్ లెటర్స్ కూడా బోగస్ వే
- ఈ విషయం వాస్తవం కాదా?
శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు చెందిన ఓ విద్యార్థి నిన్న తమకు ఫోన్ చేశాడని, ‘ప్లేస్ మెంట్ అండ్ ట్రైనింగ్’ పేరిట పదిహేను వేల రూపాయలు తీసుకుంటారని అతను చెప్పాడని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొన్నారు.
ఈ రోజు మీడియాతో కుటుంబరావు మాట్లాడుతూ, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థలు గతంలో తమకు ఇచ్చిన ఆఫర్ లెటర్స్ బోగస్ కంపెనీలవని ఆ విద్యార్థి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులను పలువురు విద్యార్థులు విద్యానికేతన్ యాజమాన్యానికి చేసిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయమై విద్యా శాఖ ఎంక్వయిరీకి సిద్ధమేనా? అని మోహన్ బాబును సూటిగా ప్రశ్నించారు.