vivek: బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ నేత వివేక్?

  • వివేక్ కు దక్కని పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ టికెట్
  • గోదావరిఖనిలో తన అనుచరులతో సమావేశం
  • కాపేపట్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న వివేక్

పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వివేక్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నిన్న రాత్రి ప్రభుత్వ సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు తరలివచ్చారు. ఈ సమావేశంలో చర్చంచిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన ప్రకటనను వెలువరించనున్నారు. మరోవైపు, బీజేపీలో ఆయన చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో కాసేపట్లో క్లారిటీ రానుంది.

vivek
TRS
peddapalli
bjp
  • Loading...

More Telugu News