shatrughan sinha: శత్రుఘ్న సిన్హాకు షాక్ ఇచ్చిన బీజేపీ

  • లోక్ సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ
  • సిన్హా స్థానంలో రవి శంకర్ ప్రసాద్ కు టికెట్ కేటాయింపు
  • గత రెండేళ్లుగా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హా

ఫైర్ బ్రాండ్, బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ను నిరాకరించింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ లోని పాట్నాసాహిబ్ స్థానాన్ని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు కేటాయించింది. ఎన్డీయే బీహార్ లో పోటీ చేయనున్న మొత్తం 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గత కొంత కాలంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హాకు అధిష్ఠానం మొండిచేయి చూపించింది.

పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా రెండు సార్లు వరుసగా గెలుపొందారు. గత రెండేళ్లుగా విపక్షాలతో కలసి బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు సమస్యలు, నిరుద్యోగం, రాఫెల్ డీల్ తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా, ఢిల్లీలలో విపక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీల్లో సైతం సిన్హా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై బీజేపీ అధిష్ఠానం కొరడా ఝుళిపించింది.

shatrughan sinha
patna sahib
ticket
bjp
ravi shankar parsad
bihar
  • Loading...

More Telugu News