Chandrababu: 31 కేసులున్న వారికి ఎవరైనా ఓటు వేస్తారా?: సీఎం చంద్రబాబు ఫైర్
- జగన్ అరాచక శక్తి అనేందుకు అఫిడవిట్ ఆధారం
- చిన్నాన్న హత్యను రాజకీయం చేసిన వ్యక్తి
- ఆంధ్రా ద్రోహులను పల్లెత్తు మాట అనడు
విపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. 31 కేసులు ఉన్న వ్యక్తికి, హత్యారాజకీయాలు చేసే వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ 48 పేజీల్లో 31 కేసులు నమోదై ఉండడం జగన్ అరాచక శక్తి అనేందుకు ఆధారమని ధ్వజమెత్తారు. దేశంలో మరే రాజకీయ నాయకుని అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవేమోనన్నారు. అమరావతిలోని తన నివాసంలో ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చిన్నాన్న హత్యను కూడా జగన్ రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం నీచమన్నారు. కేసీఆర్, మోదీలకు జగన్ బానిసగా మారారని, వీరంతా ఆంధ్రాద్రోహులని ధ్వజమెత్తారు. ఆంధ్రా ద్రోహులకు ఓటుతో తగిన బుద్ధిచెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.