Andhra Pradesh: టీడీపీలో మరో వికెట్ ఔట్.. పార్టీకి రాజీనామా చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే!

  • పి.గన్నవరం టికెట్ కేటాయించని చంద్రబాబు
  • మనస్తాపంతో పార్టీకి గుడ్ డై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే
  • నేడు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టికెట్ ను ఈసారి నెలపూడి స్టాలిన్ బాబుకు కేటాయించడంతో మనస్తాపం చెందిన నారాయణమూర్తి టీడీపీని వీడారు.

కాగా, ఈరోజు పిఠాపురంలో జగన్ సమక్షంలో నారాయణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. పీఠాపురంలో జరిగే వైసీపీ సభలో భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో ఆయన పార్టీలో చేరతారని పేర్కొన్నాయి. అయితే వైసీపీలో చేరిక అనంతరం జగన్ నారాయణమూర్తికి ఏ బాధ్యత అప్పగిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
gannavaram p
pulaparti narayanamurty
  • Loading...

More Telugu News