enforcement directrate: వైసీపీ అధినేత జగన్‌పై ఈడీ కేసు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
- ఆచార్య, ఆధిత్యనాథ్ విషయం ప్రస్తావించిన సీబీఐ న్యాయమూర్తి
- సందేహం వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ
- ఒకరిద్దరిపై కొట్టేసినా మిగిలిన వారిపై కొనసాగించవచ్చని స్పష్టీకరణ
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్లో ఒకరిద్దరిపై కేసు కొట్టివేసినా మిగిలిన వారిపై కొనసాగించవచ్చని పేర్కొంది. వివరాల్లోకి వెళితే... సీనియర్ ఐఏఎస్ అధికారులు బి.పి.ఆచార్య, ఆదిత్యనాథ్‌దాస్‌పై ఈడీ నమోదు చేసిన ఓ కేసును హైకోర్టు జనవరి 21న కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి మధుసూదనరావు ఈ కేసులో ఇతర నిందితుల మాటేమిటని సందేహం వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ లేఖ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు రాగా, ఇతర నిందితులపై కేసు కొనసాగించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.