Pawan Kalyan: కుల, మత ప్రస్తావన లేకుండా పవన్ నామినేషన్ పత్రాలు.. ఆస్తుల వివరాలు!

  • పవన్ స్థిరాస్తుల విలువ రూ.రూ.40.81 కోట్లు
  • చరాస్తి విలువ రూ. 12 కోట్లు
  • అప్పులు రూ.33.72 కోట్లు

మార్పు కోసమంటూ రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శుక్రవారం భీమవరంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో పవన్, ఆ పార్టీలో ఇటీవలే చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో కులమత ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. పత్రాల్లో ఎక్కడా కులం గురించి కానీ, మతం గురించి కానీ ప్రస్తావించలేదు. అయితే, నిబంధనల ప్రకారం ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే పవన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం వుంటుంది. ఒకవేళ అదే జరిగితే తనకు బదులుగా బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని కూడా పవన్ పేర్కొనలేదు.

పవన్ తన నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. ఆయన స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 40.81 కోట్లు కాగా, రూ.33.72 కోట్ల అప్పులున్నాయి. చరాస్తి విలువ రూ. 12 కోట్లు. 2016-17లో పవన్ ఆదాయం రూ.15,28,71,589 కాగా, 2017-18లో ఆదాయం రూ. 9,50,14,927, ముందస్తు పన్నుల కింద రూ. 60,17,967 చెల్లించారు. వాహనాల విషయానికొస్తే.. రూ. 72.95 లక్షల విలువైన మెర్సిడస్‌ బెంజ్‌ ఆర్‌ క్లాస్‌ కారు, రూ. 21.50 లక్షల విలువైన ఫార్చూనర్‌ కారు, రూ. 27.67 లక్షల విలువైన స్కోడాకారు, రూ. 13.82 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ.1.06 కోట్ల విలువైన వోల్వో ఎక్స్‌‌సీ 90 కారు, రూ. 32.66 లక్షల విలువైన హార్లే డేవిడ్‌సన్‌ బైక్ ఉన్నాయి.

భార్య పేరు మీద రూ.30.50 లక్షల విలువైన చరాస్తులు, మూడు ప్రాంతాల్లో 18 ఎకరాల పొలం, ఆరు చోట్ల వ్యవసాయేతర స్థలాలు, నివాస భవనం ఉన్నాయి. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సింగిల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌ ఉంది. ఆమె పేరిట రూ.40 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

Pawan Kalyan
Jana Sena
Bhimavaram
Nomination papers
Andhra Pradesh
  • Loading...

More Telugu News