Narendra Modi: 29న రాజమహేంద్రవరానికి మోదీ.. ఏప్రిల్ ఒకటి తర్వాత కర్నూలులో సభ

  • ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా విజయ సంకల్ప సభలు
  • ఏపీకి కేంద్రం అందించిన సాయంపై కరపత్రాలు
  • 26న బీజేపీ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచార సభలతో వేడిపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి రాబోతున్నారు. ఆ రోజు ఆయన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో తెలిపారు.

అలాగే, ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత కర్నూలులో మోదీ సభ ఉండే అవకాశం ఉందని జీవీఎల్ తెలిపారు. ఈ నెల 24, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా 480 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 26న మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఏపీకి కేంద్రం అందించిన నిధులు, చేసిన సాయంపై కరపత్రాలు విడుదల చేస్తామని జీవీఎల్ తెలిపారు.

Narendra Modi
GVL Narasimharao
Andhra Pradesh
Rajamahendravaram
BJP
  • Loading...

More Telugu News