Prajashanthi: ప్రజాశాంతి పార్టీ చీఫ్ వింత చేష్టలు.. కారులో వెళుతూ గాల్లో పంచ్ లు విసిరిన పాల్!

  • వింత చేష్టలతో ఆకట్టుకుంటున్న పాల్
  • పవన్‌ను విమర్శిస్తూ స్టేజిపైనే డ్యాన్స్
  • తనను పలకరించిన వాహనదారులకు గాల్లో పంచ్‌లు

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఇటీవల తరచూ వార్తల్లో వ్యక్తి అయ్యారు. తాజా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న పాల్.. చంద్రబాబు, జగన్, పవన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా పవన్‌ను విమర్శిస్తూ స్టేజిపైనే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచిన పాల్.. ఈసారి కారులో ప్రయాణిస్తూ గాల్లో పిడిగుద్దులు కురిపించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

శుక్రవారం కారులో వెళ్తున్న పాల్‌ను చూసిన కొంతమంది వాహనదారులు ఆయనను పలకరించారు. ముందు సీటులో కూర్చున్న పాల్ వాహనదారులు తనను పలకరించగానే ఎక్కడలేని ఉత్సాహంతో గాల్లోకి పిడిగుద్దులు విసరడం మొదలుపెట్టారు. ఆపకుండా పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేశారు. వాహనదారుల్లో ఒకరు పాల్ వింత చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. డ్యాన్స్, ఫైటింగ్ స్కిల్స్‌తో పాల్ బాగానే ఆకట్టుకుంటున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Prajashanthi
KA Paul
Pawan Kalyan
Andhra Pradesh
Elections
  • Error fetching data: Network response was not ok

More Telugu News