TRS: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన మరో ఇద్దరు తెలంగాణ సీనియర్ నేతలు

  • పార్టీకి రాపోలు, చిత్తరంజన్ దాస్ రాజీనామా
  • సీనియర్లకు విలువ లేదన్న దాస్
  • రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సూచన

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కండువా కప్పుకోగా.. తాజాగా మరో ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా ప్రకటించి షాక్ ఇచ్చారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌‌తో పాటు పీసీసీ ఓబీసీ కమిటీ ఛైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు విలువ లేదని, సామాజిక న్యాయం కొరవడిందని అన్నారు. తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించిన ఇరువురూ, తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. అయితే తమ భవిష్యత్ కార్యాచరణను మాత్రం రాపోలు, దాస్ ఇద్దరూ ప్రకటించలేదు.

TRS
Chittaranjan Das
Rapolu anand bhaskar
Congress
Rahul Gandhi
  • Loading...

More Telugu News