Andhra Pradesh: టీడీపీకి మద్దతు ప్రకటించిన కొణతాల రామకృష్ణ

  • హోదా,హామీలను సాధించే సత్తా టీడీపీకే ఉంది
  • రాష్ట్రంలో టీడీపీ విజయానికి పాటుపడతా
  • పార్టీ ఆదేశిస్తే అభ్యర్థుల తరపున ప్రచారానికి దిగుతా

మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ ఏ పార్టీలో చేరతారన్న చర్చలకు తెరపడింది. టీడీపీకి కొణతాల రామకృష్ణ బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించే సత్తా టీడీపీకే ఉందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ విజయానికి పాటుపడతానని, పార్టీ ఆదేశిస్తే అభ్యర్థుల తరపున ప్రచారానికి రాష్ట్ర మంతటా పర్యటిస్తానని చెప్పారు.

Andhra Pradesh
ex minister
konatala
Telugudesam
  • Loading...

More Telugu News