Delhi: రైలు వస్తుండగా మెట్రో ట్రాక్‌ పైకి దూకిన బాలిక

  • బాలికను రక్షించిన మెట్రో సిబ్బంది
  • ఎందుకు దూకిందో తెలియ రాలేదు
  • 20 నిమిషాలు ఆలస్యంగా నడిచిన రైళ్లు

 ఇటీవల ఒక మహిళ తన చేజారిన రూ.2000 నోటు కోసం రైలు వస్తుండగా మెట్రో ట్రాక్‌పైకి దూకి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన మరువక ముందే, ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. నేటి ఉదయం ఓ బాలిక.. రైలు రావడాన్ని గమనించి హఠాత్తుగా మెట్రో ట్రాక్‌పైకి దూకింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఆ బాలికను రక్షించారు. ఆ బాలిక ఎందుకు దూకిందనే విషయం తెలియ రాలేదు. కానీ ఈ ఘటన కారణంగా అటుగా రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.

Delhi
Metro Rail
Girl
Track
  • Loading...

More Telugu News