West Godavari District: ఒకేసారి నామినేషన్ దాఖలుకు వచ్చిన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. ఇరు వర్గాల ఘర్షణ

  • తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇరు పార్టీలు
  • కార్యకర్తల మధ్య వాగ్వాదం
  • లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని ఉండిలో టీడీపీ, వైసీపీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి మంతెన శివరామరాజు, వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఒకే ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేసేందుకు భారీగా కార్యకర్తలతో తహసీల్దార్ కార్యాలయానికి రాగా ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపు చేశారు. 2014లో ఉండి స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేనే రంగంలోకి దించింది. ఈసారైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది.

West Godavari District
Vundi
Shiva Rama Raju
PVL Narasimha Raju
YSRCP
  • Loading...

More Telugu News