New delhi: కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైఎస్ సునీత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b330140a8f7d99b1005dfe31882bd0678a07106b.jpg)
- వివేకా హత్య కేసు విషయమై ‘హోం’ను కలిసిన సునీత
- ఈ కేసు వ్యవహారం ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఉంది
- కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని సూచన
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లేదా మరేదైనా సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను వైఎస్ సునీతారెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర హోం శాఖను కలవాలన్న సీఈసీ సూచనల మేరకు ఆమె ఆ శాఖ కార్యదర్శిని కొద్ది సేపటి క్రితం కలిశారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ కేసు విషయమై ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కనుక, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి తనకు సూచించినట్టు ఆమె చెప్పారు.